తాగి వాహనం నడిపితే రూ.10,000 భారీ జరిమానా, జైలు శిక్షలు – పోలీస్ కమిషనర్ కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం 2019 (Motor Vehicle Amendment Act 2019) ప్రకారం ఇకపై డ్రంకెన్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వాహదారులను హెచ్చరిస్తూ, ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

డ్రంకెన్ డ్రైవింగ్‌లో మొదటిసారి పట్టుబడిన వారికి రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ కలిపి శిక్ష విధించబడుతుంది. అదే నేరం రెండోసారి చేస్తే రూ.15,000 జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.
తాగి వాహనం నడిపినవారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ లేదా రద్దు చేయవచ్చు. అలాగే, తాగి వాహనం నడిపి ప్రమాదం చేసి ఎదుటివారు మరణిస్తే IPC సెక్షన్ 105 BNS (304 II) కింద కేసు నమోదు చేయబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఎదుటివారు గాయపడితే సెక్షన్ 110 BNS (308 IPC) కింద 7 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

అదేవిధంగా పోలీసులు బ్రెత్ అనలైజర్ (Breath Analyzer) ద్వారా మద్యం సేవించిన వారిని గుర్తించగలరు. పరీక్ష నిరాకరించినా అదే చట్టం కింద శిక్ష విధించబడుతుంది అని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. తాగి డ్రైవింగ్ చేయరాదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని కమిషనర్ కఠినంగా హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment