మెదక్ : నర్సాపూర్, శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. నర్సాపూర్ మరియు శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి, అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై వివరణలు పొందారు.

జిల్లా ఎస్.పి.డి. మాట్లాడుతూ, నేర ప్రవృత్తి గల వారిపై, తరచూ నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.


అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ఆస్తి నేరాలు, ఐటీ కేసులపై రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అనుమానితులపై సమాచారాన్ని సేకరించాలని ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. పోలీస్ అధికారులకు సూచించారు.

అదేవిధంగా, డ్రైవింగ్ చేసినప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తాగి వాహనాలు నడపవద్దని ప్రజలకు సూచించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, నర్సాపూర్ ఎస్ఐ లింగం, శివంపేట్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, మరియు ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment