|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో రెండు దొంగతన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీర హనుమాన్ దేవాలయ హుండీ తాళం పగలగొట్టి నగదు దోచుకున్న ఘటనపై ఫిర్యాదుదారుడు లక్ష్మీ నర్సాగౌడ్ ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో స్థానిక దుకాణ తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించారని వసీం ఫిర్యాదు చేశాడు.
ఈ రెండు కేసులపై ఎస్సై స్పెషల్ టీం ఏర్పాటు చేసి, దర్యాప్తులో భాగంగా గోత్రాల నాగరాజు అనే నిందితుడిని ధర్పల్లి బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.2106 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి.
కేసులను కేవలం 24 గంటల్లో చేధించిన ధర్పల్లి సీఐ, ఎస్సై మరియు పోలీస్ సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.








