నవిపేట్‌లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని మృతదేహం కనిపించడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
స్థానికులు మృతదేహాన్ని గమనించి వెంటనే నవిపేట్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచారం సేకరించారు. మహిళ వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాల మధ్యగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

మహిళ శరీరంలో తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా, వివస్త్ర స్థితిలో కనిపించడం ఘటనను మరింత భయానకంగా మార్చింది. పోలీసులు ప్రాథమికంగా ఇది దారుణ హత్య కేసుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని వేరే ప్రాంతంలో చంపి ఇక్కడికి తీసుకువచ్చి పడేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మిట్టాపూర్ గ్రామ పరిసరాలు భయాందోళనకు గురయ్యాయి.
పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలి గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రజలను ఎవరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment