నిబంధనలకు విరుద్ధంగా భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నిర్వహణపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ పలు శాఖల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నదని, ప్రధాన రహదారి నుండి పెట్రోల్ బంక్‌కు ఉండవలసిన కనీస క్లియరెన్స్ 12–15 మీటర్లు కాగా, ఈ బంక్ ఆ ప్రమాణాలను పాటించడం లేదు.

దీనివల్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు రహదారికి ఆనుకొని ఉండటం వల్ల వాహనదారుల ప్రమాదాలకు దారి తీస్తోంది, పెట్రోల్ బంక్ స్థాపనకు అవసరమైన 35m x 35m = 1225 చదరపు మీటర్ల (సుమారు 0.30 ఎకరా) స్థలం ఉండాలి. కానీ ఈ శక్కర్ నగర్ పెట్రోల్ బంక్ వద్ద అందుబాటులో ఉన్న విస్తీర్ణం దాని సగం కూడా లేదు, కొనుగోలుదారులు ఉపయోగించవలసిన కనీస మౌలిక సదుపాయాలు, పార్కింగ్ స్థలం, భద్రతా, ఏర్పాట్లు సరైన విధంగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో అగ్నిని అదుపు చేయడానికి అవసరమైన సామగ్రి కూడా సరిగా అందుబాటులో లేవు, అగ్నిమాపక కేంద్రం పక్కనే ఉన్నా, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బంక్ నిర్వహణ ఇలా ప్రజాలకు ప్రమాదకరంగా మారి ఉండగా, తరచు తనిఖీలు చేసే సంబంధిత అధికారులు ఈ లోపాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? భారత్ పెట్రోలియం సంస్థ కూడా ఈ సమస్యలను దృష్టిలో పెట్టకుండా కేవలం విక్రయాలపై దృష్టి పెట్టడం పై ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ చాలాకాలం క్రితందే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, స్థానికులకు, వాహనదారులకు సమస్యలు తలెత్తకుండా సరైన చర్యలు చేపట్టవలసిన బాధ్యత అధికారులపై ఉంది.

ఇకనైనా ఈ పెట్రోల్ బంక్‌పై తక్షణ విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికంగా విమర్శలు వెలివెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment