|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం కారణంగా గత 6 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తల్లిగారి ఇంటికి వెళ్లింది.
ఈ విషయం గమనించిన గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లో దాచిన చైన్, 20 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత నగదు దొంగిలించారు.

బాధితురాలు సరిత పిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేశారు.








