|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు, పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని బస్టాండ్ వద్ద ఈ ఘటన జరగడంతో స్థానికంగా ఈ హత్య ఆందోళన కలిగించింది, హంతకులు మృతుని పెట్రోల్ పోసి దహనం చేశారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత నెల 24న కూడా ఇక్కడే ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే, ఇప్పుడు రెండో దారుణ హత్యతో గ్రామస్తులు భయాందోళన నెలకొంది, మృతుని శరీరం సగ భాగం కాల్చబడినట్లు మరియు పక్కన బండరాయి ఉండడం కారణంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం, గ్రామంలో సురక్షితతను సాకారం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.








