|| దృశ్యం న్యూస్ ||
2018 శాసనసభ ఎన్నికల సమయంలో బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలీసులపై, ప్రజలపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అటకాయించారు. దీనిపై ప్రథమ శ్రేణి న్యాయస్థానంలో విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి పూజిత, 26.03.2025 బుధవారం రోజున తీర్పు వెలువరించారు.
ఈ ఘటనకు కారణమైన 7 మంది వ్యక్తులకు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి ₹5,000 జరిమానా విధించారు. ఈ తీర్పు ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోబడతాయని
న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రామాణికతను కాపాడేందుకు ఇటువంటి చర్యలు అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.








