|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీక్లీ బజార్ ముదిరాజ్ గల్లిలో ఉన్న ఇంటిలో రహస్యంగా నడుస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.
ఈ ర్యాపిడ్ రైడ్‌లో పోలీస్ అధికారులు 10 మంది పేకాటరాయులను అరెస్ట్ చేశారు.
అదేవిధంగా 10 సెల్‌ఫోన్స్ మరియు రూ.66,410/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారుల తెలిపారు.








