|| దృశ్యం న్యూస్ ||
అశోక్ సాగర్‌లో మరో బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది, గత వారం రోజుల క్రితమే నిజామాబాద్ వాసి ఆత్మహత్య చేసుకోగా, తాజాగా గురువారం రోజున నెహ్రునగర్ గ్రామానికి చెందిన షేక్ ఖాయుం (45) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు,
స్థానికుల సమాచారం ప్రకారం, షేక్ ఖాయుం ఓ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, రుణం చెల్లించలేక అతడు తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తెలిపారు,
ఈ ఘటనపై 6వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
సంబంధిత అధికారులు ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని, అశోక్ సాగర్ లో మరల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా చర్చలు జరిపి త్వరగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.








