అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొనబడింది.
మృతదేహం అలీసాగర్ లిఫ్ట్ పంప్ హౌస్ కాలువ ద్వారా లిఫ్ట్ తూము వద్దకు చేరుకున్నట్లు లిఫ్ట్ పంప్ హౌస్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతాగాళ్ల సహాయంతో మృతదేహాన్ని కాలువ నుండి బయటికి తీశారు.

పోలీసులు వివరాల ప్రకారం మృతదేహం కుళ్ళిపోయి స్థితిలో వుందని, ఒంటి పై ఎలాంటి గాయాలు లేవని, మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు.
లిఫ్ట్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment