|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది.
గురువారం ఉదయం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు, మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు సుమారు 50 ఏళ్ల వయసు పైబడి ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి మృతుని గుర్తింపు లభించలేదని, మృతుని వివరాలు తెలిసినవారు ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.








