నిజామాబాద్‌: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది.

పాలిటెక్నిక్ గ్రౌండ్ సమీపంలో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి వెంటనే మూడవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన ఎస్ఐ హరిబాబు, సీఐ శ్రీనివాసరాజు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

చిన్నారి ఎలా మృతి చెందాడు? ఇది హత్యా లేదా దుర్ఘటన? ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎల్లప్పుడూ జనసంచారం ఉండే ప్రదేశంలో ఇలాంటి అమానుష ఆకస్మిక ఘటన చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చిన్నారి మృతదేహాన్ని చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు.

ఇది దాదాపుగా హత్యగానే భావిస్తున్న స్థానికులు ఈ హృదయ విదారక ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment