క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనలో MSC ఫారం గ్రామానికి చెందిన షేక్ హుస్సెన్, తన భార్య ఆసియా బేగం (40)తో వారి ఇంటివద్ద తీవ్ర వాగ్వాదానికి దిగాడు అని, కోపావేశంలో భార్య తలను గోడకు బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది స్థానికుల ద్వారా సమాచారం తెలిసింది.

ఘటన తర్వాత భార్య మృతి చెందినది అని గమనించి భయపడ్డ హుస్సెన్, ఆసియా బేగం అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే భార్య బంధువులు ఘటన స్థలానికి చేరుకొని అబద్ధాన్ని బయటపెట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
ఎడపల్లి పోలీసులు ఆసియా బేగం బంధువుల ఫిర్యాదుతో నిందితుడు షేక్ హుస్సెన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు హింసాకాండకు దారి తీసిన ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment