|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పరిసరాలలో పేకాట ఆడుతున్న 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ గ్రామ శివారులోని ఒక్క షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై రేగోడ్ పోలీసులు నిర్వహించిన రైడ్లో హైదరాబాద్ పటాన్చేరు, శంకర్పల్లి, జనవాడ, చేవెళ్ల, అల్వాల్ ప్రాంతాలకు చెందిన యువకులు పట్టుబడ్డారు. వారివద్ద నుండి ₹2,19,000 నగదు, సెల్ఫోన్లు, కారు, ఆటో, బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్చార్జ్ సీఐ రేణుక రెడ్డి మాట్లాడుతూ – అల్లాదుర్గ్ పరిధిలో పేకాట ఆడినా కఠిన చర్యలు తప్పవు అని, పేకాట స్థలాలను కూడా సీజ్ చేస్తాం” అని హెచ్చరించారు. అలాగే, పేకాట మోజుతో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని యువతకు సూచించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పేకాట, జూదం కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. యువత క్రమశిక్షణతో మెలగి తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని పోలీసులు సూచించారు.








