పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్భంగా 7 అంబులెన్సుల కానుక.

|| దృశ్యం1 న్యూస్ ||

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులను ప్రభుత్వ ఆసుపత్రులకు కానుకగా అందించారు. ఇందులో భాగంగా, మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సును రఘునందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అందజేశారు.

మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శివదయల్, డాక్టర్ సునీత, డాక్టర్ కిరణ్ లకు అంబులెన్సును అప్పగించారు. ఈ అంబులెన్సు పేద ప్రజల సేవలకు ఉపయోగపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ MLN రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్, పట్టణ మండల అధ్యక్షుడు నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment