13 మంది VDC సభ్యులకు 5 సంవత్సరాల జైలు శిక్ష – చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్ష అనివార్యం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా: గ్రామ అభివృద్ధి కమిటీల (VDC) పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారి ఆగడాలకు ఇక చరమగీతం పలికేలా నిజామాబాద్ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత VDCల అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచారు. కులం లేదా మతం పేరుతో, గ్రామ అభివృద్ధి పేరుతో సామాజిక విభేదాలు కలిగించేలా వ్యవహరిస్తే తప్పకుండా శిక్ష విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలో జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన ఒక కేసును తిరిగి వెలికి తీసి, సంబంధిత 13 మంది VDC సభ్యులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ ఎంక్వైరీ అనంతరం న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

పోలీసుల ఈ చర్యకు సమాజంలోని శాంతియుత వాతావరణాన్ని కాపాడాలనే సంకల్పమే కారణం అని, ఇకపై ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment