జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్., మీడియాకు వివరాలు వెల్లడించారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా మొత్తం 174 సైబర్ క్రైమ్ కేసులు విచారణ నిమిత్తం కోర్టులలో మరియు బ్యాంకులలో నిలిచిపోయిన రూ. 71,52,505 మొత్తం ఆర్థిక వసూళ్లు పరిష్కరించబడి బాధితులకు అందించడం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు.

ఈ కేసుల్లో 25,000 రూపాయల కన్నా ఎక్కువ నష్టపోయిన 131 కేసులలో రూ. 67,00,221.

25,000 రూపాయల కన్నా తక్కువ నష్టపోయిన 43 కేసుల్లో రూ. 4,52,284 మోసపోయిన బాధితులకు అందజేయబడుతాయని తెలుపుతూ,

సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానాన్ని సాధించింది అని తెలిపారు.

అదేవిధంగా సైబర్ మోసాలు, హ్యాకింగ్ వంటి నేరాలకు గురి కాకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని, తమ ఆర్థిక, మరియు వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తు, సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన బాధితులు గంట లోపు 1930 ( గోల్డెన్ అవర్ ) నంబరుకు ఫిర్యాదు చేస్తే లో సమస్యను త్వరగా పరిష్కరించే అవకాశం మరియు పొగుట్టుకున్న డబ్బులు ఎక్కువ మొత్తంలో తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది అని తెలియచేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment