|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి, అలియాస్ శివ స్వామి, జ్యోతిష్యంతో మహిళలను మోసగించాడు. ఈ స్వామి తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో నిద్ర మాత్రలు కలిపి లైంగిక దాడి చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా ఆర్థిక లాభం కోసం లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు.

ఈ దొంగ స్వామి వేములవాడ జిల్లా నుండి వచ్చిన వ్యక్తి జ్యోతిష్యం చెబుతూ పలు ప్రాంతాల్లో సంచరిస్తూ మోసాలు చేసి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అతని మొబైల్ ఫోన్ లో బాధితుల నగ్న వీడియోలు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు గుర్తించబడ్డాయి.
పోలీసులు ఈ ఘటనలో పూర్తి విచారణ చేపట్టి, దొంగ స్వామిజీని రిమాండ్ కి పంపించారు. జ్యోతిష్యాలు, మంత్రాలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు.








