|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం సంఘయిపల్లి గ్రామానికి చెందిన చేవ్వా ప్రవీణ్ (25) పాత కక్షలతో అదే గ్రామస్థుడైన లక్ష్మీనారాయణపై పొలంలో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ మృతిచెందాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అప్పటి దర్యాప్తు అధికారి రామాయంపేట్ సీఐ శ్రీధర్, ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకట రాజా గౌడ్ సమగ్ర విచారణ జరిపారు. సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టగా, జిల్లా జడ్జి నీలిమ నిందితుడు ప్రవీణ్‌కు జీవిత ఖైదు మరియు రూ.5,000 జరిమానా విధించారు.
ఈ తీర్పులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్, లైసోనింగ్ ఆఫీసర్ ఎస్ఐ విట్టల్, సీడీఓ అశోక్ కీలక పాత్ర పోషించారు.
ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ శిక్ష నేరస్తులకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని, ఎవరైనా నేరపూరిత చర్యలకు పాల్పడితే చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదని హెచ్చరించారు. శిక్ష సాధనలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.








