బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్‌కు ప్రాణహాని భయం.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, నరసింహులు గౌడ్ తదితరులు కల్లు దుకాణాలు నడుపుతున్నారు. వీరు సీసా ధరను ₹15 నుండి ₹20 వరకు విక్రయిస్తుండగా, గ్రామ ప్రజలు కల్లుబంధ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామ ప్రజల కోరిక మేరకు మామిడి అంజాగౌడ్ తక్కువ ధరకు, అంటే ₹10కు ఒక్క సీసా కల్లు విక్రయించడం ప్రారంభించడంతో తక్కువ ధర కారణంగా ప్రజలు కల్లు కొనుగోలుకు అంజాగౌడ్ వద్దకే ఎక్కువగా మొగ్గు చూపారు. దీనివల్ల ఇతర కల్లుగీత కార్మికులు అంజగౌడ్ పై అసూయతో బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తూ, “చంపుతాం” అని బెదిరిస్తున్నారని ఆరోపించాడు.

అంజాగౌడ్ తన ప్రాణ రక్షణ కోసం ఆప్కారీ శాఖ అధికారులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు సమయంలో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ కార్యక్రమంలో గంగన్న, రమేష్ బేగరి, నాగరాజు పార్టీ, అశోక్ గొల్లపల్లి, దుర్గయ్య మంగలి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment