అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని హిందూ వాహిని సభ్యులు ఆరోపించారు. రుద్రూర్ బస్టాండ్ సమీపంలో వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ వాహనం బాన్సువాడకు చెందిన మాజీ ఉపసర్పంచ్‌కు చెందినదని ప్రచారం జరుగగా అతడికి మద్దతుగా రుద్రూర్ మండల మాజీ ఉపసర్పంచ్ భర్త ఇతర నాయకులతో కలిసి పోలీసులు, ఎస్ఐ సాయన్నను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే హిందూ వాహిని సభ్యులు వెనక్కి తగ్గకుండా బోధన్ గోషాలకు తరలించాలని డిమాండ్ చేశారు.

రాత్రి అక్రమ రవాణా తీవ్రమైందని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేకంగా రుద్రూర్ బస్టాండ్ చౌరస్తాలో సీసీ కెమెరాలు లైట్లు లేనందున అక్రమ రవాణాదారులకు అనుకూల పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అక్రమ రవాణా కొనసాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment