అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి కాడే చిన్న సాయిలు అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా రోడ్డు ప్రమాదమే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి మృతికి గల స్పష్టమైన కారణాలు, తదితర వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది.

ఈ ఘటనపై రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment