|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా హవెలి ఘనపూర్ మండలంలోని శమ్నపూర్ గ్రామంలో చోటుచేసుకున్న భర్త హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి నీలిమ జీవిత ఖైదు మరియు రూ.5,000 జరిమానా విధించారు.
మూడు సంవత్సరాలు దుబాయ్‌లో పనిచేసి తిరిగి గ్రామానికి వచ్చిన సంగపోల్లా మలయ్య (50) తన భార్య లక్ష్మి మరియు జాల రాందాస్ మధ్య అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురయ్యాడు.

ఈ కేసును హవెలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసి అప్పటి సీఐ పి. రాజశేఖర్ సమగ్ర దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలు సేకరించారు. ప్రస్తుత సీఐ జర్జ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. న్యాయమూర్తి సమగ్రంగా సాక్ష్యాలు పరిశీలించి నిందితులను దోషులుగా తేల్చారు.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.








