అధికార దుర్వినియోగం పై వేటు: బోధన్ మున్సిపల్ కమిషనర్ జాధవ్ కృష్ణ సస్పెండ్.

|| దృశ్యం న్యూస్ ||

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రస్తుత బోధన్ మున్సిపల్ కమిషనర్ జాధవ్ కృష్ణను సస్పెండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ పరిపాలన కమిషనర్ & డైరెక్టర్ డా. శ్రీదేవి ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆధికార నివేదిక ప్రకారం, జాధవ్ కృష్ణ
◆భుక్తాపూర్ ప్రాంతంలోని మున్సిపల్ ఖాళీ భూములకు అనధికారికంగా డోర్ నంబర్లు కేటాయింపు.
◆మావలాలో నిర్మాణం లేకపోయినా డోర్ నంబర్ జారీ.
◆ఇందిరమ్మ కాలనీలో 50 అడుగుల రోడ్డుపై అక్రమ ◆నిర్మాణానికి డోర్ నంబర్ కేటాయించి అనుమతి పొందేలా సూచనలు చేశారు.

అదేవిధంగా సంబంధిత ఫైళ్లను కమిషనర్ లాగిన్ ద్వారా ఆమోదింపజేయాలని బలవంతంగా ప్రయత్నించారని ఈ చర్యలన్నీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ నివేదిక వెల్లడించింది. దాని ఆధారంగా జూలై 7న షోకాజ్ నోటీసు జారీ కాగా, జూలై 8న ఇచ్చిన జవాబు అసంతృప్తికరంగా ఉండటంతో, తెలంగాణ సివిల్ సర్వీసెస్ నియమావళి 1991లోని 8(1)(a) నిబంధన ప్రకారం సస్పెన్షన్ అమలులోకి తీసుకొచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది అని ఉత్తర్వుల ద్వారా కమిషనర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment