బోధన్ : టి పాయింట్ పేరుతో యదేచ్ఛగా మద్యం అమ్మకాలు.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ పట్టణ కేంద్రంలోని బైపాస్ వద్ద, శ్రీనివాస్ క్యాంప్ గ్రామం వెళ్ళే మార్గంలో ఉన్న టి పాయింట్ పేరుతో మద్యం అమ్మకాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి.
ఈ ప్రదేశంలో నేరుగా మద్యం అమ్మకాలు మాత్రమే కాకుండా, మద్యం సేవించేందుకు వచ్చే వారికీ కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

ఈ మద్యం దుకాణం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండడం స్థానికంగా నివాసం వుండే ప్రజలకు పెను ఇబ్బందిని కలిగిస్తుంది, రాత్రి 10 గంటలకు ముందు ఒక రేటు 10 గంటల తర్వాత మరొక అధిక రేటుతో అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం, అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం అమ్మకాలు జరపడంతో చుట్టూ ఉండే ప్రాంతాల నుండి మద్యం సేవించేవారి రాకపోకలు అధికమవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యం అనుభవిస్తున్నారు.

 

స్థానికులు పలుమార్లు ఆబ్కారీ శాఖ అధికారులకు సమాచారం అందించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటంతో ఇలాంటి వ్యవహారాలు బోధన్ పట్టణ మరియు రూరల్ ప్రాంతాల్లో రాత్రింబవళ్లు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇలాంటి కార్యకలాపాల వల్ల స్థానిక ప్రాంతంలో ప్రమాదాలు లేదా అఘాయిత్యాలు చోటు చేసుకుంటే తప్ప అధికారులు అధికార కార్యాలయాల నుండి అడుగు బయట పెట్టేలా లేరు.
సంభాదిత అధికారులు ఇలాంటి సమస్యలపై ఇకనైనా చర్యలు తీసుకుంటారో లేదో అని అందరికి సందేహమే.

Join WhatsApp

Join Now

Leave a Comment