వివాహానికి రెండు రోజులు ముందు విషాదం – వరుడి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండు రోజులుగా కనిపించకుండా ఉన్న ప్రతాప్ మృతదేహాన్ని గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతూ స్థానికులు గుర్తించారు.

ప్రతాప్‌ వివాహం గురువారం జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో గ్రామం అంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పెళ్లి ముందు జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామస్తుల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment