ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై జిల్లా కలెక్టర్, బోధన్ ఆర్డీఓ, ఎడపల్లి తాహసిల్దార్ కార్యాలయాలలో పిర్యాదు చేయబడినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచార హక్కు చట్టం అవగాహన రక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాతూరి యాదగిరి గౌడ్ అన్నారు.

ఈ ఏడాది మార్చి నెలలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విచారణకు ఆదేశించినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
గత నెల 24న ఎడపల్లి తహసీల్దార్, ఆర్.ఐ మరియు మండల సర్వేయర్ నుండి సరైన నివేదిక అందించాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు కానీ ఏమీ జరగలేదు.

సోమవారం మండల సర్వేయర్ కేవలం ఆక్రమిత భూమిని చూసి తరువాత సర్వే నిర్వహించాలని సూచించడం,
ఈ సమస్యకు సంబంధించిన, కబ్జా వ్యవసాయ భూమికి సంబంధించి ఎటువంటి దస్తవేజులు తీసుకొని రాకపోవడంతో పలు అనుమానాలు అధికమయ్యాయి.

ఈ భూమి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు కబ్జా కోరులకు నిబంధనలకు విరుద్ధంగా వత్తాసు పలుకుతున్నారని యాదగిరి గౌడ్ ఆరోపించారు.

సంబంధిత అధికారులు ఇకనైనా కాలయాపన చేయకుండా ఈ వ్యవహారంపై త్వరితంగా విచారణ జరిపి, కబ్జా అయినా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వ అధికారుల ద్వారా స్వాధీనం పొందడానికి సంబంధించి కార్యాచరణలు చాలా ఆలస్యం కావడం, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో, సమస్య మరింత సంక్లిష్టంగా మారింది.
ఈ చర్యను పటిష్టంగా అమలు చేయాల్సిన సమయం ఇప్పుడు ఇంకా ఆసక్తికరంగా మారింది అని అధికారులు ఇంకా కాలయాపన చేస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యాదగిరి గౌడ్ తెలిపారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment