మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని నేషనల్ హైవే 765డీపై బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారం ప్రకారం, నర్సాపూర్ వైపు నుంచి మెదక్ దిశగా వెళ్తున్న బైక్‌ను మెదక్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హవేలీ ఘన్పూర్ మండలం బూర్గుపల్లికి చెందిన తండ్రి-కొడుకులు అమృత్ గౌడ్ (51), రిషివర్ధన్ గౌడ్ (13), అలాగే బొగడ భూపతిపూర్‌కు చెందిన సాయిగౌడ్ (32) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment