|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు తెలుగు యువత నాయకుడు ఏత్తోండ రాజేందర్ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి ప్రమోద్ మృతి పట్ల రెండు నిమిషాల మౌనం పాటించారు. నిందితుడు రియాజ్ అనే వ్యక్తి అనేక దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండగా, పోలీస్ కానిస్టేబుల్ అదుపులోకి తీసుకునే సమయంలో కత్తితో ప్రమోద్‌పై దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ సందర్భంగా ఏత్తోండ రాజేందర్ మాట్లాడుతూ, “ఇలాంటి ఘోరమైన ఘటనలు మళ్లీ జరగకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి అని, నిందితుడు రియాజ్‌ను వెంటనే అరెస్ట్ చేసి, ప్రజల ముందే శిక్షించాలి” అని అన్నారు. బోధన్ యువత రియాజ్‌ను తక్షణమే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కోట అబ్బయ్య, దాల్ మార్కపోశెట్టి, జెల్లా సతీష్, లక్ష్మణ్, రవి, నవీన్, శంకర్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








