|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధూపల్లి గేట్ వద్ద, నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల వివరాల ప్రకారం, రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన వాద్యాల రాములు, ఆయన భార్య ఇంద్రతో కలిసి టీవీఎస్ చాంప్ (TS16ET 9295) ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ నుండి స్వగ్రామానికి ప్రయాణం చేస్తున్న సమయంలో ధూపల్లి గెట్ వద్ద రోడ్డు దాటే క్రమంలో బోధన్ నుండి అతివేగంగా వస్తున్న మహీంద్రా XUV 700 (AP40BK 0652) వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే మృతిచెందగా, భార్య ఇంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి అంబులెన్స్ లో అత్యవసరంగా తరలించారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








