వర్ని తహసిల్దార్ సాయిలును సన్మానించిన కూనీపూర్ గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, వర్ని మండల తహసిల్దార్ సాయిలు ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసిల్దార్ అవార్డు అందుకున్నారు. సాయిలు సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించినందుకు కూనీపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు.

సన్మాన కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, పెద్దకాపు లక్ష్మారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు గిరి గంగారం పాల్గొన్నారు.
అలాగే మాజీ సర్పంచ్ కాంతయ్య, వెంకట్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సాయగౌడ్, రామచంద్ర రెడ్డి, కుటుంబ రావ్, గిరి సాయిలు, ప్యాట్ల సాయిలు, కుర్మ లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, హన్మాండ్లు, దత్తు, సాయిలు మరియు అనేక మంది గ్రామస్తులు హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలు తహసిల్దార్ సాయిలు సేవలకు గౌరవం తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment