|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ అధికారులు అక్కడి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని చెరువులో నుండి బయటకు తీశారు.
చనిపోయిన వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి చనిపోయిన వ్యక్తి యొక్క మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








