|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరిసర గ్రామాలైన మందర్నా, సిద్ధపూర్, ఖండ్గాం ప్రాంతాల నుంచి గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఈ విషయమై స్థానికులు, రైతులు పలుమార్లు సంబంధిత అధికారులకు, బోధన్ సబ్ కలెక్టర్ కు సైతం ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇసుక అక్రమాలపై అధికారుల మౌనం ఎందుకు?

ఇసుక క్వారీలలో, రవాణాలో ఘోరమైన అక్రమాలు జరుగుతున్నా అధికారుల మాత్రం మౌనం వహిస్తూ ఫిర్యాదులను పెడచెవిన పెడుతున్నారు.
👉 కాంట్రాక్టర్లు అనుమతికి మించిన లోతులో ఇసుకను తోడేస్తున్న.
👉 మానవ శ్రమను విస్మరించి పెద్ద ఎత్తున మిషనరీ వాడకంతో ఇసుకను తవ్వేస్తున్న,
👉 అనుమతి ఉన్న 15 టన్నులకే పరిమితంగా ఉండాల్సిన లోడును 20 టన్నులకుపైగా బరువుతో టిప్పర్లలో తరలిస్తున్నా.
👉 ఇసుక లోడు ప్రక్రియలో కాట్రాక్టర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న.
👉 రెవెన్యూ అధికారులు ముందే టిప్పర్లలో అధిక ఇసుక లోడు జరుగుతున్నా.
👉 రోడ్లపై అధిక లోడుతో , అతి వేగంతో టిప్పర్లు ప్రయాణిస్తున్నా.
ఇంతటి అక్రమాలకు సంబంధిత శాఖ అధికారుల మద్దతు, సహకారం లేకపోతే ఇవన్ని సాధ్యమవుతాయా? అని అనుమానిస్తున్న ప్రజలు.

సమీప ప్రాంతాల్లో వే బ్రిడ్జ్ లేకపోవడం సరైన లోడును గుర్తించలేకపోతున్నామని రెవెన్యూ అధికారుల సమాధానం, అయిన అధిక లోడు రవాణాపై “మాకు సంబంధం లేదు” అంటూ మరో సమాధానం,
అదే దారిలో RTO అధికారులు:

రోజూ వందల వాహనాలు రవాణా అవుతున్నాయి ఎన్ని అదుపు చేయగలం అంటున్న ఆర్టీఓ, ఈ విషయం గురించి జిల్లా రవాణా కమిషనర్ (DTC) కు సమాచారం అందించినప్పటికీ స్పందన లేకపోవడం, అధికారుల నుండి ఇలాంటి నిర్లక్ష్య సమాధానాల వల్ల ప్రజలలో ఉన్న అనుమానాలు ఇంకా పదిలం చేస్తున్నాయి,
ఇది అధికారుల నిర్లక్ష్యమేన లేదా పాలకుల ప్రమేయమా అనే అనుమానం కూడా ప్రజల్లో వుంది.
పాలకుల నిశ్శబ్దం పై ప్రజల అసహనం:

ఈ అక్రమాలపై ప్రముఖ ప్రజా ప్రతినిధులు, పాలకులు మౌనంగా ఉండటం విచారకరం. గత ప్రజా పాలకుల అక్రమాలపై వ్యతిరేకంగా గళం విప్పి గెలిచిన పాలకులు అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలపై మౌనం వహించడం, గతంలో మాదిరిగా ప్రస్తుతం అదేవిధంగా అక్రమాలు జరుగుతున్న నిశ్శబ్దంగా ఉండటంతో ప్రజలలో పాలకులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇసుక అక్రమాలకు తావులేకుండా చూడాలని స్పష్టం చేసినప్పటికీ, బోధన్ లో ఆ ఆదేశాలు అమలుకావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
వెంటనే చర్యలు తీసుకోకపోతే పాలకులపై ప్రజా వ్యతిరేకత తప్పదు.

ఇసుక అక్రమ రవాణా నిలిపివేయకపోతే స్థానికంగా ప్రజల్లో ఆందోళనలు తలెత్తే అవకాశం వుంది, ఈ అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు అవకాశంగా మలచుకొని సరైన సమయంలో సంధించడానికి ఎదురు చూస్తున్నారు అని, పది సంవత్సరాల అనంతరం అధికారాన్ని కైవసం చేసుకున్న పాలకులు ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రస్తుత సానుకూలత బలహీన పడటం ఖాయమని, రాష్ట్ర జిల్లా యంత్రాంగం ద్వారా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.








