పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం బోర్డుల ఏర్పాటుకు చెయ్యాలి – ఏసీపీకి వినతిపత్రం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులు ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేయాలని, డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ బోర్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా, పోలీస్ స్టేషన్ పరిధి ముగింపు బోర్డులు చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్‌ల ఫోన్ నంబర్లు రహదారులపై స్పష్టంగా చూపే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వీటిని తక్షణం అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేయని సీసీ కెమెరాలను మరమ్మతు చేయించాలి అని, భారీ వాహనాలను బోధన్ పట్టణంలోకి ప్రవేశించకుండా బైపాస్ రూట్ ద్వారా మళ్లించే చర్యలు తీసుకోవాలని ఏసీపీ వినతిపత్రం అందజేశారు.

ఈ చర్యలు తీసుకుంటే ప్రజలకు రక్షణ పెరిగి శాంతిభద్రతలు మెరుగవుతాయని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment