|| దృశ్యం న్యూస్ ||
ఇసుకను ప్రస్తుతం కొనుగోలు చెయ్యలనుకునే సామాన్య ప్రజలకు గణనీయమైన కష్టాలను తెచ్చిపెడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన సిద్ధపూర్ మరియు ఖండ్గావ్ గ్రామాల నుండి ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ అనుమతులతో ఇసుక రవాణా ప్రారంభమైంది.
అయితే ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు ఇసుక రవాణాను క్రమబద్ధీకరించే దిశగా తీసుకున్న చర్యలు వల్ల సామాన్య ప్రజలకు ఉపయోగం లేకుండా పోతోంది.

ప్రభుత్వ అధికారులు ఇచ్చిన అనుమతులు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇసుక రవాణా చేసే వ్యక్తులు కాంట్రాక్టర్లు మాత్రమే లాభలు పొందుతున్నారు..
ప్రతి రవాణా ఒప్పందం ప్రకారం డిడి ని పొందే సమయం మొదలుకొని పలు విధానల ప్రక్రియను పూర్తి చెయ్యాలంటే సామాన్య కొనుగోలుదారులకు పెద్ద సమస్యగా మారుతోంది.
కాంట్రాక్టర్ల తీరు – వాహనాలు, ఇతర ఖర్చుల వల్ల అధిక ధరలు

ఇసుక రవాణా చేసే వ్యక్తులు బ్యాంకు లేదా ఇతర సదుపాయల ద్వారా సుమారు 5వేల రూపాయలు చెల్లించి అనుమతులు పొందుతున్నారు, అయితే ఈ ఇసుకను వాహనంలో లోడు చేసే కాంట్రాక్టర్లు దాదాపు 7వేల రూపాయలు వసూలు చెయ్యడం, వాహన అద్దె, ఇంధన ఖర్చులకు దాదాపు 10వేల రూపాయల ఖర్చు, అదేవిధంగా ఇసుకను రవాణా చేసే వ్యక్తులు కొంత లాభం ఆశించడంతో, మార్కెట్ లో ఒక్క టిప్పర్ ఇసుక దాదాపు 25,000 రూపాయల ధర పలుకుతూ సాధారణంగా గృహ నిర్మాణం చేపట్టాలనుకునే పేద ప్రజలకు మరింత ఆర్థిక భారం కలుగచేస్తోంది..

ఇసుకను పరివాహక ప్రాంతం నుండి అనుకూల ప్రదేశానికి తరలించి లోడర్ల ద్వారా టిప్పర్లలో నింపడానికి కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు,
కూలీలు, ట్రాక్టర్లు, లోడర్ల ఖర్చు అని ఒక్కో టిప్పర్ కు దాదాపు 7వేల రూపాయలు వసూలు చేస్తూ, రోజుకు 40 నుండి 50 వాహనాలలో నింపుతూ రోజుకు 2.5 లక్షల రూపాయల వసూళ్ళు పొందుతున్నారు.
ఈ విధానం వల్ల కాంట్రాక్టర్లు ఎంత ఖర్చు చేసిన పెద్ద మొత్తంలోనే మిగులు లబ్ది పొందుతున్నారు, ఈ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు రాజకీయంలో, సదరు వ్యవస్థ విధి విధానంలో ఆరితేరి అధికార యంత్రాంగం తీరు తోడై ఉండటం వల్ల ఒక్కో టిప్పర్లో ఇసుకను లోడు చెయ్యడానికి తన ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్న అడిగే నాధుడే కరువయ్యారు.
ఇసుక రవాణాలో అధికారుల నిర్లక్ష్యత – సమర్థతా లోపాలు

ఒక డిడి ప్రకారం, ఇసుక రవాణా చేసే వాహనాలలో 22 టన్నుల అనుమతులు ఉన్నప్పటికీ, వాస్తవంలో 24 నుండి 25 టన్నుల వరకు రెవెన్యూ అధికారి ముందే వాహనాల్లో లోడింగ్ జరుగుతున్న మా శాఖ పరిధిలోని వ్యవహారం కాదంటూ మౌనం వహించడం..
వాహనల తనిఖీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు రవాణా మరియు భద్రత చట్ట నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ఇసుకను తరలించే క్రమంలో స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎన్ని ప్రమాదాలు ఎదురైన, ఎన్ని ఇబ్బందులు ఎదురైన అధికారుల నుండి తగిన చర్యలు చేపట్టకపోవడం వల్ల పలు సందేహాలు నెలకొంటున్నాయి..

అదేవిధంగా పోలీస్ శాఖ పరిధిలో చేసే పైపై తనిఖీ చర్యలు, ఇతర విధి విధాన లోపల వల్ల రాత్రులు సైతం యదేశ్చగా అక్రమంగా ఇసుక రవాణా చేపట్టి కొన్ని ప్రాంతాలలో ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేస్తూ సమయానుకూలంగా తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు..
ఇలా సంబంధిత అధికారులు వ్యవహరించే తీరు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటం, స్థానికులు, రైతులు, వాహనదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతోంది.
ఈ విధంగా, ఇసుక రవాణా వ్యవస్థ పై ప్రభుత్వ విధానాలు, కాంట్రాక్టర్ల వ్యవహార తీరు, మరియు అధికారుల నిర్లక్ష్యం తోడై ఇసుక ధర సామాన్య ప్రజలకు చుక్కలు చూపెడుతోంది.
సామాన్య ప్రజలు అదనపు ఆర్థిక భారం ఎదుర్కోకుండా, ఇసుక రవాణా వ్యవస్థలో మార్పులు చేసి సామాన్య ప్రజలు ప్రయోజనం పొందేలా చెయ్యాలని ప్రభుత్వ ఉన్నత అధికారులకు ప్రభుత్వానికి పలువురు విన్నవించుకుంటున్నారు.
దృశ్యం న్యూస్








