పేకాటపై ఉక్కుపాదం మోపుతున్న మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో అక్రమ పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాపన్నపేట్ మండలం పరిధిలోని అబ్దులపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13,400 నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించగా, అబ్దులపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి అక్రమ చర్యల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తప్పు మార్గాలు ఎంచుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment