నిజామాబాద్‌లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లిన ఒడ్డెన్న తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఈ సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాధమిక దర్యాప్తులో ఒడ్డెన్న జారి నీటిలో పడిపోయి ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వ సహాయం అందించాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment