|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ చెరువులో సోమవారం తెల్లవారుజామున ఓ తండ్రి, కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్థానిక సమాచారం ప్రకారం వర్ని చౌరస్తాకు చెందిన క్రాంతి (35) అనే వ్యక్తి తన 2 సంవత్సరాల కూతురుతో కలిసి బైక్ పై చెరువుకు చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని..
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టి ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇలా వరుస కుటుంబ ఆత్మహత్యలు జరగడంతో స్థానిక నిజామాబాద్ ప్రజలను కలవరనికి గురి చేసింది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కావచ్చు ఘటన స్థలంలో పోలీసులు పర్యవేక్షణలో ఉన్నారు.








