ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ ||

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన చేకూరి బుల్లి రాజు (50), అతని భార్య సునీత (45), బోధన్ మండలం బెల్లాల్‌కు చెందిన వాణి (38)లు అక్కడికక్కడే మృతి చెందారు.
మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన పాలజి గణనాథుడి దేవాలయం దర్శనం ముగించుకుని స్వగ్రామాలకు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. గాయపడిన గున్నం చంద్రశేఖర్ (35), నీలిమ (45)లను బైంసా, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంతో హుమ్నాపూర్, బెల్లాల్ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment