నిజామాబాద్‌లో తెలంగాణ గవర్నర్ పర్యటన: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు డిచ్పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ద్వితీయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని భద్రతా ఏర్పాట్లను, వీవీఐపీ గమనాన్ని, ట్రాఫిక్ నియంత్రణను సజావుగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఇతర అధికారులు ఏర్పాట్ల వివరాలు కమిషనర్‌కి వివరించారు.

అనంతరం, డిచ్పల్లి 7వ బెటాలియన్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. కమాండెంట్ పి. సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ కె.పి. సత్యనారాయణ, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై షరీఫ్ తదితరులు ఈ కమిషనర్ తో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment