|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత చర్యలు అనుమానాస్పదంగా మారాయి. శనివారం పరీక్ష కేంద్రం సమీపం నుండి ఓ కాగితాన్ని వాటర్‌మెన్ ద్వారా కేంద్రంలోకి పంపించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై వివరణ కోరగా, తన సబ్జెక్టుకు సంబంధించి పరీక్ష జరుగుతుందని, ఇన్విజిలేటర్లకు మజ్జిగ పంపిస్తున్నానని సదరు నేత సమాధానమిచ్చాడు. అయితే, ఈ వివరణపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలలో పారదర్శకత పాటించాలన్న విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








