వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ సమాచారం ఆధారంగా కల్లు దుకాణం సమీపంలో జరుగుతున్న బొమ్మా బోరుసు జూదంపై దాడి చేసి 6 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.17,709 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువులు, అరెస్టయిన వారిని శంకరంపేట్ (ఏ) పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పేకాట, బెట్టింగ్ వంటి కార్యకలాపాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయని, ముఖ్యంగా యువత చెడు మార్గాలను ఎంచుకోవద్దని సూచించారు. ప్రజలు కూడా ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment