పిడిఎస్ రైస్ గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు: సుమారు ₹2,80,000/- విలువైన బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు PDS రైస్ గోదాంలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడిలో అక్రమంగా నిల్వ చేసిన 8 టన్నుల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ₹2,80,000/- గా అంచనా వేయబడింది. అదేవిధంగా ముగ్గురు గోదాం నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

స్వాధీనం చేసుకున్న PDS రైస్‌ను తదుపరి చర్యల నిమిత్తం బోధన్ టౌన్ SHOకి అప్పగించారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇలాంటి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment