|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ముఖ్యమైన దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, CCS సిబ్బంది కలసి వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామంలో మంగళవారం 25 క్వింటళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ రవాణా వ్యవహారాలు అడ్డుకుంటూ, ఇలాంటి దాడులు యథాశక్తిగా కొనసాగిస్తామని అధికారులు తెలుపుతూ, ఈ స్వాధీనం సంబంధించి అన్ని తదుపరి చర్యలు వర్ని పోలీస్ స్టేషన్ SHO SI కి అప్పగించబడ్డాయి.








