ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి – 9 మంది అరెస్ట్ : ₹45,110 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ ఇన్‌చార్జ్ సీపీ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులోని మామిడి తోట వద్ద నిర్వహించబడుతున్న పేకాట స్థావరంపై దాడి చేసింది.
ఈ సందర్భంగా 9 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని, వారి వద్ద నుండి 5 సెల్‌ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ₹45,110 నగదు స్వాధీనం చేసుకుంది.

ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ సి.ఐ కి అప్పగించారు. పట్టుబడిన వ్యక్తులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ప్రజలకు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తూ, ఇలాంటి అక్రమ కార్యకలాపాల సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment