ఎడపల్లి: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి – ఆరుగురు పేకటారాయుళ్ల అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.
ఈ దాడిలో ఆరుగురు పేకటారాయుళ్లను అఫుపులోకి తీసుకొని, 06 సెల్‌ఫోన్లు, ₹15,780 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పేకటారాయుళ్లను పై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. ప్రజల రక్షణలో భాగంగా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై మరిన్ని చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment