ధర్పల్లిలో వీధి కుక్కల స్వైర విహారం – 12 మందికి గాయాలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో వీధి కుక్కల విహారం భయాందోళనకు గురిచేస్తోంది. పిచ్చికుక్క దాడిలో 12 మంది గ్రామస్థులు గాయపడగా, వారిలో ఇద్దరు చిన్నారులు వరుణ్, హర్షిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన బాధితులను ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

ఈ సంఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే వెనుకంజ వేస్తున్నారు.
గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి మరియు పంచాయతీ అధికారులను ప్రజలు వేసుకుంటూ వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

స్థానిక సంస్థలు వీధుల్లో తిరిగే కుక్కలపై వెంటనే తగు చర్యలు చేపట్టి, గ్రామ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment