|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో, వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర వీరశైవ లింగాయత్ నమాజ్ ప్రతినిధి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వీరశైవ జంగమ లింగాయత్ నాయకులు నర్సింగ్ అప్ప, లక్ష్మణ్ పటేల్, పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీఆర్ దేశాయ్ మాట్లాడుతూ, కార్తీక మాసం అక్టోబర్ 23న ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర నవంబర్ 5న కార్తీక పౌర్ణమి నాటికి ముగుస్తుంది అని తెలిపారు. 15 రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో భక్తులు భజనలతో, కీర్తనలతో పాల్గొని, మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజర్ సుంభా గ్రామంలోని కపిలధార జలపాతంలో పుణ్యస్నానం చేసి, మన్మథ స్వామి జిత్త స్మారక దర్శనంతో యాత్రను ముగించనున్నారు. బోధన్ నుండి సుంకిని గ్రామం వరకు జరిగే ఈ పవిత్ర యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.








