రామాయంపేట్, నిజాంపేట్‌లో ప్రత్యేక తనిఖీలు – జిల్లా ఎస్పీ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేట్ పిఎస్, నిజాంపేట్ పిఎస్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మాదకద్రవ్యాల తనిఖీలుతో పాటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ధాబాలు, కల్లు కాంపౌండ్లు, పాన్ షాపులు వంటి అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల ఉద్దేశ్యం గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా అరికట్టడం, మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ వంటి ఉత్పత్తులపై నిఘా పెంచడం. గంజాయి రవాణా, విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

జిల్లాను గంజాయి రహితం చేసేందుకు ప్రజలు సహకరించాలని, మత్తు వ్యాపారం సమాచారం ఉంటే డయల్ 100 లేదా యాంటీ నార్కోటిక్స్ టోల్‌ఫ్రీ 1908కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment